Breaking News

తపాలా శాఖా NPCI ఖాతాల ద్వారా ప్రభుత్వ పధకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానం మరియు NPCI లింకేజ్ చేయుట తప్పనిసరి అని అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని పోస్టల్ డిపార్ట్మెంట్ కు GSWS డిపార్టుమెంటు వారు లిఖిత పూర్వక సందేశం ఇచ్చినట్టు సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోస్టాఫిసెస్, విజయవాడ డివిజన్ ఎమ్.నరసింహ స్వామి విలేకరులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ దలచిన సంక్షేమ పథకాలు “తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ’ వంటి పథకాల నగదు నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ చేయుటకు NPCI mapper లో ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.

అయితే మన రాష్ట్రంలో సుమారు 51 లక్షల మందికి వారి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ లేని కారణంగా గత సంవత్సరంలోనే GSWS స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొంత పురోగతి సాధించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో చాలా మందికి ఆధార్ అనుసంధానం కాలేదు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ను సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో జూన్ 5వ తేదీ లోగా అందరికీ ఆధార్ సీడింగ్ తో పాటు NPCI లింకేజ్ చేస్తూ ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథక ఫలితాలు ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ ఆధార్ సీడింగ్ జరిగిన IPPB ఖాతాలో జమ కాబడిన పథకాల నగదు ను ఏ పోస్టాఫీసులో అయినా తీసుకునే సదుపాయంతో పాటు ఫోన్ పే గూగుల్ పే కు లింక్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ NEFT,IMPS, UPI కూడా చేసుకునే సౌకర్యం కూడా కలదు అని తెలియచేశారు.

కావున ఆధార్ సీడింగ్( NPCI మ్యాపింగ్) కానీ వారు వెంటనే తమ దగ్గరలోని పోస్టాఫీసు ను సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలకు సిద్ధంగా IPPB అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేసుకోగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *