విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి పెమ్మసాని వెళ్ళి సుజనా ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని ప్రజా సేవకు పునరంకితం కావాలని పెమ్మసాని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News