Breaking News

మంత్రి కందుల దుర్గేష్ కి ధన్యవాదాలు తెలిపిన రేషన్ షాప్ డీలర్లు

-కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేయడంపై హర్షం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్ షాపు డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, అందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్యులు కందుల దుర్గేశ్ కి రేషన్ డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిడదవోలు లోని మంత్రి వారి కార్యాలయంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్  ని మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్‌ వాహనాల రద్దును ఆహ్వానిస్తున్నామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరిస్తున్నామని అన్నారు. డీలర్ల వ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *