Breaking News

బంగాళాఖాతంలో అల్పపీడనం

-రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది . గురువారం (నేడు) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదల అవకాశం ఉంది. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసారు.. ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంటుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *