Breaking News

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశంలో అజెండాకు సంబంధించి చర్చించిన అంశాలపై జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్ఎస్ఎంఈ క్లస్టర్లు ఏర్పాటుకు అనుకూలమైన భూములను పరిశ్రమల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ వెంటనే గుర్తించాలన్నారు. సింగిల్ డెస్క్ లో పరిశ్రమల అనుమతుల దరఖాస్తులను సంబంధిత శాఖలు సక్రమంగా వెరిఫికేషన్ చేసి పెండింగ్ లేకుండా నిర్దేశిత సమయంలొ సక్రమంగా పరిష్కరించాలన్నారు. సింగిల్ డెస్క్ ద్వారా వచ్చిన 49 దరఖాస్తులకు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి 34 దరఖాస్తులను మంజూరు చేస్తూ , 14 దరఖాస్తులను పెండింగ్ లో వుంచి , ఒక దరఖాస్తును తిరస్కరించడం జరిగింది. జిల్లాలో 18 ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఇన్వెస్ట్మేంట్ సబ్సీడీ, రీయింబర్స్మేంట్ ఆఫ్ ఇంట్రస్ట్ సబ్సీడీ, రీయింబర్స్మేంట్ ఆఫ్ పవర్ కాస్ట్ సబ్సీడీ , రీయింబర్స్మేంట్ ఆఫ్ సేల్స్ టాక్స్ సబ్సిడీ , రీయింబర్స్మేంట్ ఆఫ్ క్వాలిటి సర్టిఫికేషన్ , క్లీనర్ ప్రొడక్షన్ కు సంబంధించి రూ.55,68,580/- లు మంజూరు చేస్తూ సమావేశంలో ఇన్ చార్జ్ జిల్లా కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆమోదించారు. అదే విధంగా 36 సబ్సిడీ క్లైమ్స్ ను వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగింది.

సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ.జయలక్ష్మీ , లీడ్ బ్యాంకు మేనేజరు మహిపాల్ రెడ్డి, జిల్లా భూగర్భజలవనరుల శాఖ డిప్యూటీ డైరక్టర్ వందనం, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ బీ హెచ్ మనోరమ, డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కే.రాంబాబు , కార్మిక శాఖ సహాయక కమిషనరు కృష్ణవేణి , బిఎం ఏ పి ఎస్ ఎఫ్ సి కే.అనిత , జెడ్ ఎం ఏపిఐఏసి డా.ఎం.ఎల్.నరసింహారావు , డిపిఓ సాయి కుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు , ఆర్ డి ఓ కే. శ్రీనివాస రావు, ఎస్ఎస్సీసీఐ రీజినల్ హెడ్ జి.పరిమల , ఎఫ్ ఏ పీ ఎస్ ఐ ఏ కో ఆర్డినేటర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *