Breaking News

మాకు న్యాయం చేయండి… : బాధితురాలు రావులమ్మ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రెస్క్లబ్లో జగ్గయ్యపేట కి చెందిన ముక్కల రావులమ్మ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముక్కల రావులమ్మ మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్యపేట మున్సిపాలిటీ లో స్వీపర్ గా పనిచేస్తున్నాను. నా కొడుకు చనిపోయిన బాధలో నేను ఇంటి వద్దనే ఉండగా ఇదే అదునుగా భావించి నా ప్రమేయం లేకుండా దొంగ సంతకాలు, వేలిముద్రలు ఫోర్జరీ చేసి నా కూతురు వేముల నాగేంద్ర,అల్లుడు వేముల గోపాల్ ఉద్యోగం కాజే శారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగ్గయ్యపేట మున్సిపల్ అధికారులు అందరికీ విషయం చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయానని రాములమ్మ అన్నారు. అధికారులను కౌన్సిలర్ లను నా ఉద్యోగం గురించి అడిగితే సమాధానం చెప్పట్లేదు నా ఉద్యోగానికి సంబంధించిన రికార్డ్స్ కూడా చూపించడం లేదని. స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్ చుట్టు తిరుగుతూనే ఉన్నానని కానీ నా సమస్య పరిష్కరించి నాధుడే లేదని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో కలెక్టర్ ని గారిని కలిస్తే న్యాయం చేస్తామని అన్నారు. నా భర్తకి ఆరోగ్యం బాగోలేదని నా కొడుకు అవిటి వాడిని వాళ్ళిద్దర్నీ పోషించడానికి రోజు యాచిస్తూ పూట గడుపుతున్నాను తినటానికి తిండి లేదు, ఉండడానికి నిలువ నీడ లేక రోడ్డు మీద జీవనం సాగిస్తున్నామని, ఈ వర్షాల వల్ల వానలోనే తడుస్తు జీవనం సాగిస్తున్నాము.అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాము ఒక్క అధికారి కూడా మాకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. రేపు మాపు అని తిప్పుతున్నారు తప్ప ఉపయోగంలేదు. మా సమస్యను తెలుసుకొని న్యాయం చేస్తారని ఆశతో ఉన్నామని దయచేసి ఫోర్జరీ చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకొని మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోని నా కుటుంబాన్ని ఆదుకోవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *