-యోగ శక్తి సాధనా సమితి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యానికి,శాంతికి భారతదేశ పు యోగులు లక్షలాదిమంది మోడల్స్ గా ఉన్నారని అలాంటి వారి గా తయారవ్వటానికి ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర ఉపయోగపడుతుందని యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.యోగాలోని ఐదు కోశాలు 1అన్నమయ కోశా 2 ప్రాణమయ 3 మనోమయ 4 జ్ఞానమయ మరియు 5 ఆనందమయ కోశాలలో ప్రాణమయకోశ ప్రాధాన్యత మేరకు అందుబాటుతనం,వాడకం తక్కువ ఉండటం ప్రజలందరికీ ప్రాణమయ కోశా శిక్షణ, చికిత్సలు అందుబాటులోనికి తెచ్చి ఆరోగ్యం ఆనందం మరియు పూర్ణ ఆయుష్ అందించే లక్ష్యంతో ఏర్పడ్డ యోగ శక్తి సాధనా సమితి భారత ప్రధాన మంత్రి మోడీ అందించిన ఫిట్నెస్ మంత్ర ని ఇంటింటికి చేరువ చేయడంతో సాధించవచ్చునని ఇంటర్నేషనల్ యోగ డే 2025 కార్యక్రమాలలో భాగంగా 21 రోజులపాటు జరిగే ఉత్సవాలలో యోగ శక్తి సాధన సమితి కేంద్ర కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగు దేశం పార్టీ లీడర్ వెలగపూడి శంకర బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.కార్యక్రమం కు వచ్చిన అందరికి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణి చేసారు.
ప్రార్ధన,నమస్కారముద్రలో ఓంకార ప్రాణాయామ,మోడీ హ్యాండ్ స్టిక్ వాడకము -ఆరోగ్య ప్రయోజనాలు,మెడిటేషన్,చెవుల మర్దన,బేర్ ఫుట్ వాక్- ప్రయోజనాలు తెలిపి,నాడీ శోధన చేసి వ్యక్తిగత డైట్ ప్లాన్ మరియు చికిత్స ప్లాను ఇవ్వటంతో ఎవరి ఆరోగ్యం వారే పొందే లాగా ఇకముందు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యం, ఆనందం గురించి అవగాహన కలిగించినట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.’యోగాంద్ర’ప్రజారోగ్య కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రజలకు యోగ త్వరితగతిన చేరువ చేయడానికి విశాఖపట్నంలో ప్రధానమంత్రి సే జూన్ 21న ప్రారంభించడానికి దాని ముందు ఒక నెలపాటు రాష్ట్రమంతా జరిగే సన్నాహ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశమంతా గుర్తించే లాగా ఖ్యాతి గడిoచారని డాక్టర్ మకాల సత్యనారాయణ కొనియాడారు.ఈ కార్యక్రమంలో అతిధిగా ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామిక సంఘము సెక్రటరీ కానూరి విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎస్పా భారత్ ఉపాధ్యక్షుడు భూతపాటి ఉదయ్ కుమార్,సయ్యద్ అష్రఫ్నిసా,ప్రభావతి, వెలగపూడి శ్రీదేవి,యూ బి రామరాజు, విఠల్,యోగశక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సేవలు అందించారు.
Prajavartha Online Telugu News