Breaking News

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్దనున్న నాసిన్ కేంద్రంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని శుక్రవారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిసి నంది విగ్రహాన్ని, పుష్పగుచ్చంను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత, హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *