Breaking News

పూర్ణానంద పేట లో సి. కె. గ్రాండ్ అండ్ హోటల్ అభి ప్రారంభోత్స‌వం

-వ్యాపార‌స్తుల‌కు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంది : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ప్ర‌భుత్వంలో వ్యాపార‌స్తులు వ్యాపారం చేయ‌టానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వుండేది..ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథం వైపు ప‌య‌నిస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పూర్ణానంద పేట రైల్వే హాస్పిటల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన సి. కె. గ్రాండ్ అండ్ హోటల్ అభి ను ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. హోట‌ల్ రంగంలో సి. కె. గ్రాండ్ అండ్ హోటల్ అభి బాగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ హోట‌ల్ ఓన‌ర్ పవన్ కుమార్ కు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోమాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, డివిజన్ అధ్యక్షులు బుదాలి నందకుమారి, ఎ. కొండా, మధుసూదన్ రావు, ఎమ్. డి. జాహీద్, మాజీ కార్పొరేట్ సుభాషిణి, టిడిపి నాయకులు గంగాధర్ రెడ్డి, ఎస్. డి అన్సర్, రాజు, ఇమ్రాన్, పెరుమాళ్లు, పీతా బుజ్జి, మోహనరావు, రాఘవేంద్ర, దాసు, కొట్టేటి సరిత లతోపాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *