యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టడం జరిగినదని, జూన్ 14 న పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైల్ యోగా సాధన మాక్ డ్రిల్‌కు 1500 మందికి పైగా వైద్య ఆరోగ్య సిబ్బంది హాజరై విశేషం అని, జూన్ 14 , జూన్ 21 తేదీల్లో నిర్వహించే కార్యక్రమం లో మరింత మంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి మార్గదర్శకతలో వివిధ ప్రభుత్వ శాఖల, వివిధ రంగాల వారితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు జేసీ తెలిపారు. వైద్యులు, ఆశావర్కర్లు, ANM లు,
అర్బన్ మెడికల్ ఆఫీసర్లు, అర్బన్ వైద్య ఆరోగ్య సిబ్బంది MLHP లు, DM&HO కార్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఈ సాధన కార్యక్రమం లో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందన్నారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం ద్వారా జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రేపటి కార్యక్రమానికి ఎక్కువమంది పాల్గొని మరింత విజయవంతం చేయాలని కోరారు. జూన్ 14 రెండవ శనివారం ఉదయం 6 గంటలకు ఏకేసీ కాలేజ్, హ్యాపీ స్ట్రీట్ యోగాంధ్ర మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *