విభిన్న ప్రతిభా వంతునికి ఎమ్ పి లాడ్స్ ద్వారా హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను అందజేత

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
\ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా విభిన్న ప్రతిభావంతునికి ఎమ్ పి లాడ్స్ ద్వారా హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను జాయింట్ కలెక్టర్. శుభం బన్సల్ తో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు శ్రీకాళహస్తి మండలం , ఆంజనేయపురం గ్రామస్తుడైన సుబ్బారాయులు విభిన్న ప్రతిభావంతునికి ఎమ్ పి లాడ్స్ ద్వారా సుమారు 5 లక్షల 70 వేలు రూపాయలు. విలువైన సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్ ఏజెన్సీ వారు తయారు చేసిన హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సి ఆర్ అండ్ ఎమ్. ఓ జి. కె. రాజశేఖర్, సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్ ఏజెన్సీ ప్రాపరైటర్ రాజు, ఇంజనీర్ చెంచల్ భారత్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *