రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్కానింగ్ సెంటర్స్ లలో డేకాయట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని , వాటి ద్వారా సూచించిన అంశాల పై సమావేశాలు నిర్వహించాలని, పరిష్కారమయ్యే విధంగా చర్చించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ మరియు జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం లింగ ఎంపిక నిషేధం అని అటువంటి ఘటనలు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్త శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందులు వినియోగం పై ప్రతి నెలా డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారిలో ఎంతమంది కి అబార్షన్ చేయడం జరిగింది అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. డికాయట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్కానింగ్ సెంటర్స్ విషయంలో కొత్తగా అనుమతులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి రెన్యువల్, సవరణలు విషయంలో నియమ నిబంధనలు అర్హతలు పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఏదైనా స్కానింగ్ సెంటర్ కి అనుమతులు ఇచ్చే క్రమంలో నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు లోబడే ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని సుస్పష్టం చేయాలని కలెక్టర్ తెలియజేశారు. డెకాయట్ ఆపరేషన్ సమయంలో ఎటువంటి లోపాలు లేవని నివేదిక ఇవ్వడం సంతృప్తి చెందేలా లేదని పేర్కొన్నారు. ఆయా స్కానింగ్ సెంటర్స్ లలో పని చేసే రేడియోలజిస్ట్ వివరాలు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఇంకో స్కానింగ్ సెంటర్ లో కూడా పని చేస్తున్నది వంటి విషయాలు కూడా పేర్కొనాలనీ కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పి సి అండ్ పి ఎన్ డి టి యాక్ట్ 1994 మరియు 1996 లో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఆయా స్కానింగ్ కేంద్రాలు, ఆసుపత్రుల సేవలు పై డెకాయిట్ ఆపరేషన్ ఉండాలని, తనిఖీలు నిర్వహించి అందచేసిన నివేదికల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా సిఫార్సు చేయడం పై కలెక్టరు స్కానింగ్ సెంటర్ వారీగా అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో సమీక్షా నిర్వహిస్తూ, కొత్తగా అనుమతులు కోసం సిఫార్సు చేసిన స్కానింగ్ సెంటర్ వివరాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు. నేటి కాలంలో స్కానింగ్ సెంటర్ యొక్క ఆవశ్యకత పెరిగిన దృష్ట్యా వైద్యులు చేసిన సూచనలు పరిగణలోనికి తీసుకుంటూ, వాటికి సంబంధించి ఇచ్చిన అనుమతులకు లోబడే కార్యకలాపాలు నిర్వహించా లన్నారు. అబార్షన్, ప్రీ అబార్షన్ కోసం వినియోగం అవుతున్న మందుల లావాదేవీలు పై డ్రగ్ కంట్రోలర్ ప్రతి నెలా నివేదిక అందచేయాలని ఆదేశించారు . అదే సమయంలో ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారిలో ఎంతమంది కి అబార్షన్ చేయడం జరిగింది అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. .
ఈ సందర్భంగా పిసి అండ్ పిఎన్డిటి యాక్ట్ పై “ఆడపిల్ల అయితేనేమి” అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. చట్ట ఆవశ్యకత , ముఖ్య ఉద్దేశ్యం , జన్యు పరీక్షల నిర్వహించే క్రమంలో ముఖ్య అంశాలు, పరీక్షల ఉద్దేశ్యం , నిర్వహించ తగిన పరీక్షల పై అవగాహన కల్పించడం జరిగింది. చట్ట ఉల్లంఘన చేస్తే విధించే శిక్షల వివరాలు తెలియ చేశారు. సమాజంలో పౌరులు కూడా తమ వంతుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిఎంహెచ్‌ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డి ఐ వో డా పి. కోమల, గైనకాలజిస్ట్ హెడ్ డా. అక్కా మాంబ , శిశువైద్యుడు డాక్టర్ మోహన్ చంద్ర , పాథాలజీ డాక్టర్ వెంకట్ లక్ష్మి, పిసి అండ్ పిఎన్డిటి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పిఎస్ఎల్ ప్రసన్న, డిప్యూటీ డీఏమ్ హెచ్ వో డా. పి. సుధాకర్ బాబు, డాక్టర్ జె. సంధ్య, డివిజనల్ పిఆర్వో ఏం. లక్ష్మణా చార్యులు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News