విజయవాడ/ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21 వరకు జరుపుతున్న యోగ మాసోన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన యోగాంధ్ర యోగాసనా పోటీలలో తూర్పుగోదావరి జిల్లా తరఫున రాజమహేంద్రవరానికి చెందిన యోగా గురువు కర్రి నాగ వెంకట శ్రీధర్ కుటుంబం జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా ఈనెల 16, 17, 18 తారీకుల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో 35 సంవత్సరముల పైబడిన వారి విభాగంలో యోగ షార్ట్ ఫిలిం లో ద్వితీయ స్థానం, యోగ ఫోటోగ్రఫీ విభాగంలో తృతీయ స్థానం సాధించగా శ్రీధర్ కుమారుడు కార్తీక్ రామచంద్రా 10 నుంచి 18 సంవత్సరముల విభాగంలో యోగ ఫోటోగ్రఫీ విభాగంలో ప్రథమ స్థానం షార్ట్ ఫిలిం విభాగంలో తృతీయ స్థానం సాధించడం జరిగింది. విజేతలను రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ, పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేష్, ఆరోగ్య శాఖామంత్రి సత్య ప్రసాద్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, రాష్ట్ర ఆయుష్ కమిషనర్ కె. దినేష్ కుమార్ సర్టిఫికెట్ , మెమెంటో లతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News