Breaking News

61,266 పాఠశాలల్లో ఘనంగా యోగాంధ్ర నిర్వహణ..

-రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు
-వెల్లడించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., 
-ప్రతి ఒక్కరిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
61,266 పాఠశాలల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
విశాఖపట్నం గీతం యూనివర్శిటీ క్రీడా మైదానంలో పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన యోగాంధ్ర కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి, విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్, సమగ్ర శిక్షా ఏపీసీ బి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ ధన్యవాదాలు: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
గత నెల రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. IAS., హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు అమూల్యమైన మద్దతు అందించిన నోడల్ అధికారులు, డిపార్ట్‌మెంట్‌లోని హెచ్‌ఓడీలందరికీ, ఆర్‌జేడీలకు, డీఈఓలకు, ఏపీసీలందరికీ, సహకరించిన ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సంస్థలు (NGOలు), పాఠశాల నిర్వహణ కమిటీ (SMC), పేరెంట్ టీచర్ అసోసియేషన్ (PTA) సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *