Breaking News

రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసన సభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర శాసన సభ ప్రాగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అంతా ఉదయం 6.30 గంటలకే చేరుకుని పలు రకాల యోగాసనాలను దాదాపు ఒక గంటపాటు అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర శాసన సభ మరియు శాసన మండలి ఉద్యోగులు పలు రకాల యోగసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో శాసన సభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉపకార్యదర్శులు కె.రాజకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఈశ్వరరావు, ఆర్.శ్రీనివాసరావు, చీఫ్ మార్షల్స్ వి.గణేష్, ఎ.మురళి తదితరులతో పాటు శాసన సభ మరియు శాసన మండలి ఉద్యోలు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *