విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీలో భాగంగా బుధవారం టీజీటీ (నాన్ లాంగ్వేజ్) ఇంగ్లీష్ మీడియం సైన్స్, పీజీటీ (లాంగ్వేజ్) హిందీ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 25880 అభ్యర్ధులకు గాను 22469 (86.82%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన టీజీటీ సైన్స్ పరీక్షకు 16271 అభ్యర్థులకు గాను 14135 (86.87%) మంది, మధ్యాహ్నం జరిగిన పీజీటీ హిందీ, టీజీటీ సైన్స్ పరీక్షలకు 9609 అభ్యర్ధులకు గాను 8334 (86.73%) మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం అనంతపురం జిల్లాలో 92.61%, మధ్యాహ్నం కృష్ణా జిల్లాలో 93.18% అత్యధికంగా హాజరు నమోదైందని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
ఈ నెల 9న జరిగిన స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), 11న జరిగిన స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ డైరెక్టర్), 19న నిర్వహించిన పీజీటీ (నాన్ లాంగ్వేజ్) బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు సంబంధించిన ‘ప్రాథమిక కీ’ డీఎస్సీ వెబ్ సైటులో, అభ్యర్థుల లాగిన్ లో రెస్పాన్స్ షీట్లు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ప్రాథమిక కీ పై తమ అభ్యంతరాలు తగిన ఆధారాలతో https://apdsc.apcfss.in ద్వారా జూలై 2 లోపు స్వీకరిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News