Breaking News

మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం

-ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు….రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీ రాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింది ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు…సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్‌కు కారణం అయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని..ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *