-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కొత్త పార్కులను నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలో ఉన్న రోడ్డులన్ని గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాలని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు ఇంటి వద్ద సేకరించడమే కాకుండా వాటిని జిందాల్ కి తరలించేలా చర్యలు తీసుకోవాలని వాహనాలను సద్వినియోగం చేస్తూ నగరంలో పరిశుభ్రత పెంచాలని, నగరంలో కొత్త పార్కులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, నగరపాలక సంస్థ పరిధిలో గల ఆస్తులన్నీ స్ట్రక్చరర్స్ స్టెబిలిటీను ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్ అధికారుల సమన్వయంతో పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశం లో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి. సత్యకుమారి, పి. సత్యనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ ఎస్ వి కే చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె. శ్రీనివాస్, సురేఖ, సామ్రాజ్యం, ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్, ఏసు పాదం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News