Breaking News

విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శనివారం ఉదయం కృష్ణా విశ్వవిద్యాలయంలో అకాడమీ బ్లాక్ లోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసము, ప్రేరణ తరగతులను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వినూత్నంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న వనరులు గాని భూమి కానీ ఖనిజాలు గాని ఉంటే సరిపోదని సరైన ప్రజలు ఉండాలన్నారు. ఆ ప్రజలను మంచివారిగా తీర్చిదిద్దాలంటే ఒక ఉపాధ్యాయునికే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థుల జీవితాలను వారి తలరాతలను మార్చగలిగే శక్తి సామర్థ్యం ఒక్క టీచర్కే ఉంటుందన్నారు.

హనుమంతుని శక్తి ఆయనకు తెలియదని ఆ శక్తిని తెలిసే విధంగా ఆయనను కార్యోన్ముఖులుగా చేసి ముందుకు సాగేలా ప్రేరణ చాలా ముఖ్యమన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వారి శక్తి సామర్ధ్యాలు తెలుసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు.
ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గాని ఉపాధ్యాయురాలు గాని తనకు అప్పగించిన సబ్జెక్టును ఎంతవరకు ప్రేమిస్తున్నారో ఆ సబ్జెక్టు కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారో, పాఠాలు చెప్పేందుకు అవసరమైన నోట్స్ తయారు చేసుకున్నారా లేదా, ఆంగ్ల ఉపాధ్యాయులు విధిగా ఆంగ్ల వార్తాపత్రికలు చదువుతున్నారా లేదా ,తెలుగు ఉపాధ్యాయులు కాంపోజిషన్స్ రాస్తున్నారా లేదా, గణిత ఉపాధ్యాయులు వేదిక గణితం, అబాకస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాల్లో దృష్టి సారిస్తున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకుని ఆ దిశగా దృష్టి సారించాలన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారి స్థాయికి తగ్గట్టుగా చదువు చెబుతున్నారా అనే విషయం పైన ఒకసారి ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా జపాన్, ఇజ్రాయిల్ దేశాలు ప్రపంచ పటంలో ఎలా ఎదిగాయనే విషయం పైన సోదాహరణంగా వివరించారు.

జిల్లా విద్యాధికారి పి వి జె రామారావు మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో జిల్లా 82.32 శాతం ఫలితాలను సాధించిందని, 161 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా నిలిచారన్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు అంకెల లో విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా ఫలితాలు రావాలని, రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించాలని, ఇందుకోసం ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేకించి శిక్షణ తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒకటి నుండి 5వ తరగతిలో కనీసం 60 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రధానోపాధ్యాయులు, 5 మంది ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు. ఆ ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టి నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ లు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు, నండూరి సుబ్బారావు వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విధంగా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.

ఈ ప్రేరణ తరగతుల్లో విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కే రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఉష, ఉపవిద్యాధికారులు, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *