విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీతమ్మ వారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గుండిచా మందిరంలో ఈ రోజు కార్యక్రమాలు ఉదయం బ్రహ్మముహూర్తంలో 4:30గం”లకు మంగళ హారతితో మొదలయ్యాయి. తర్వాత భగవంతునికి అద్భుత అలంకరణ, శ్రీల ప్రభుపాద గురు పూజ నిర్వహించిన తదుపరి ఇస్కాన్ GBC శ్రీమాన్ రేవతి రామన్ ప్రభుజీ విచ్చేసిన భక్తులందరికీ శ్రీమద్ భాగవత అమృత ప్రవచనాన్ని ఇచ్చారు. ఇందులోని విశిష్ఠత ఏమిటంటే జగన్నాథుని యొక్క మహాప్రసాదం యొక్క గొప్పతనం. ఆ మహాప్రసాదాన్ని ఏ భావంతో స్వీకరించాలి. అలా చేయడం ద్వారా భక్తుల యొక్క ఆధ్యాత్మిక చైతన్యం ఎంతలా వృద్ధిచెందుతుంది అనేటటువంటి విషయాలను సరళమైన పద్ధతిలో ఎంతో చక్కగా వివరించారు.
అనంతరం మధ్యాహ్న హారతి, శ్రావ్యమైన హరినామ సంకీర్తనలు కొనసాగాయి. సాయంత్రం 4:30గం”ల నుండి సాంసృతిక కార్యక్రమాలు కనువిందు గొలిపాయి. కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. మరి ముఖ్యంగా పండాల్ లోని స్వామి వారి రథం చుట్టూ కొన్ని వేల మంది భక్తులు 108 సార్లు హరేకృష్ణ మంత్రం జపిస్తూ పరిక్రమ నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికి అన్న ప్రసాద వితరణ జరుగుతూనే ఉంది. ఈరోజు అన్న ప్రసాద సహ సమర్పణ చేసిన వారు కోస్టల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్.
Prajavartha Online Telugu News