Breaking News

ఆంధ్ర ప్రదేశ్ వైద్య మండలి రెండు రోజుల రిజిస్ట్రేషన్ సక్సెస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి రిజిస్ట్రేషన్ ఆదివారం రాత్రి 9 గంటలకు వరకు ఈ ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగిందని, తిరుపతి పరిసరాల ప్రాంతాల డాక్టర్లు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గు మాటి శ్రీహరి రావు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం డాక్టర్లు 650 మంది రిజిస్ట్రేషన్, రీ -రిజిస్ట్రేషన్, ఎన్ ఓ సి లు, మరియు నూతన రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వయోవృద్ధుల డాక్టర్లు ఈ ప్రక్రియ చాలా బాగుందని, ఈ ప్రక్రియను మరల ఎస్ వి వైద్య కళాశాలలోనే కొనసాగించాలని డాక్టర్ శ్రీహరి రావు ని కోరినారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మరల డిసెంబర్ నెలలో కానీ జనవరిలో గాని రెండవ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవి ప్రభు, సామాజిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ ఎస్. సునీత, ఐ.ఎం.ఏ డాక్టర్లు,డాక్టర్ వాసుదేవ నాయుడు, డాక్టర్ జనార్ధన్, డాక్టర్ యుగంధర్, డాక్టర్ హరికృష్ణ, విజయవాడ ఏపీఎంసీ సిబ్బంది, ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *