జగన్మాతకు జేజేలు

-తొలి ఏకాదశి కు పోటెత్తిన భక్తజనం
-సమన్వయంతో ఏకధాటిగా 13 గంటలు..
-విధులు నిర్వహించిన ఈవో శీనా నాయక్, ఉద్యోగులు
-అమ్మవారిని దర్శించుకున్న 65,000 వేలమంది భక్తజనం
-ఎటువంటి అవాంతరాలు లేకుండా భద్రతా చర్యలు
-విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టీం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జై భవాని…జై జై భవాని.. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. వేకుజామున 5 గంటల నుంచి దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పవిత్ర కృష్ణ నది లో స్థానమాచరించి ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి నామ జపం స్మరిస్తూ అమ్మని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. సెలవదినం కావడం, ఆదివారం అందునా తొలి ఏకాదశి పర్వదినం దుర్గమ్మ వారి సన్నిధికి పెద్ద ఎత్తున భక్తులు… ఏకధాటిగా పూర్తి సమన్వయంతో.. 13 గంటల పాటు ఈవో శీనా నాయక్ విధులు నిర్వహించి ఆలయ ఉద్యోగులు భక్తులకు సేవలు అందించారు. 65 వేల మంది భక్తజనం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వారి టీం భక్తులకు విస్తృత సేవలు అందించారు.

ఊహించలేదు… దుర్గమ్మ వారి ఆలయానికి దసరా పర్వదినం నేపథ్యంలో ఏ విధంగా అయితే భక్తులు తరలి వస్తారు ఆ రీతిలోనే అమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్గా ఘాట్ , ఘాట్ రోడ్డు, మహా మండపం దిగువ భాగాన, అమ్మవారి దేవస్థానం, ఉపాలయాలైన నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి ఆలయం మొత్తంగా ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 13 గంటలకు పైగా నిరంతర పర్యవేక్షణ చేసిన ఈ ఓ శీనా నాయక్ అటు వాకీ టాకీ, ఇటు సిసి కెమెరా ద్వారా ఆదేశాలు ఇచ్చారు దేవాలయం సిబ్బంది అంతా పూర్తిగా శ్రమించారు. సుమారు 500 బృందాలు ఆషాఢ సారె సమర్పించారు. ఉదయం 6 నుండి రాత్రి 8.30 వరకు కొనసాగుతున్న ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం జరిగింది.

పటిష్ట పోలీస్ బందోబస్తు ఏ సి పి దుర్గారావు సిఐ గురు ప్రకాష్ పర్యవేక్షణ
పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పశ్చిమ ఏసిపి దుర్గారావు, వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానం సిబ్బంది,పోలీస్, సెక్యూరిటీ, శానిటేషన్, సేవా వాలంటీర్లుతో కలిపి 1000 మంది భక్తుల సేవలో పాల్గొన్నారు.భక్తులకు మంచి నీరు, ప్రసాదం, భోజనం ఏర్పాట్లలో లోటు లేకుండా సిబ్బంది కి ప్రత్యేక విధులు కేటాయింపు ప్రధాన మార్గమైన మహా మండపం మెట్లు, లిఫ్ట్ దగ్గర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పర్యవేక్షణ సారె సమర్పణ బృందాలకు సేవా వాలంటీర్ల చేయూత. కనకదుర్గా నగర్ నుండి మహా మండపం 7 వ అంతస్తు వరకు 100 మంది శక్తి సేవా సేవకులు భక్తులకు సేవలు అందించారు. ( వీరంతా విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు) సుమారు 13 గంటల నిరంతర పర్యవేక్షణతో తగ్గిన భక్తుల రద్దీ. భక్తులరద్దీ అనుసరించి టిక్కెట్ల కొనుగోలు విషయంలో నిబంధనలు అనుసరిస్తూనే, కొన్ని సందర్భాలలో సడలింపు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులకు ప్రత్యేక లిఫ్ట్ ద్వారా తరలింపు, దర్శనానికి ఏర్పాటు చేశారు. ఏకాదశి, ఆదివారం, ఆషాడ సారె సమర్పణకు గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ప్రధాన కారణమని దుర్గగుడి అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజులలో మరింత జాగ్రత్తలు వహిస్తామని దుర్గగుడి అధికారులు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *