Breaking News

పాదయాత్రలో వినూత్న దృశ్యం: మంత్రి చేతుల మీదుగా మగ్గం నేశారు…

-మగ్గం నేసిన మంత్రి
-చేనేతకు మద్దతిచ్చిన మంత్రి

ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గమైన ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పాదయాత్రలో భాగంగా ఈ రోజు 20వ వార్డును సందర్శించారు. పాదయాత్ర సమయంలో అక్కడి స్థానికులతో కలిసిమెలిసి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మవరం చేనేత సాంప్రదాయానికి తగిన గౌరవం తెలియజేస్తూ ఒక చేనేత మగ్గం వద్ద కూర్చొని స్వయంగా మగ్గం నేసారు. ఈ వినూత్న చర్య స్థానిక చేనేత కార్మికులకు ప్రేరణనిచ్చేలా, వారి వృత్తి పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతను చాటేలా నిలిచింది. చేనేతల దుస్థితిని మేము అర్థం చేసుకుంటున్నాం. ధర్మవరం చేనేతను తిరిగి ప్రోత్సహించేందుకు మేము కట్టుబడి ఉన్నాం, అని మంత్రి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *