-ముఖ్యఅతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి
-అమ్మవారి అశీసులు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలి – వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమలో పలు చోట్ల అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగ జరిగింది. ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ఆషాడ మాసంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి భక్తి శ్రద్దలతో భక్తులు సారె పేరుతొ రకరకాల కానుకలు సమర్పిస్తారని మరియు తమ మొక్కులను చెల్లించుకుంటారన్నారు. అమ్మవారికి సారెను ఇవ్వడం వల్ల పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యంగా ఉంటామని, సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకమ్మన్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పిల్లాపాపలతో సహా తరలివచ్చి భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారి అస్సిసులు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నారు.
స్థానిక 48వ డివిజన్, వాగు సెంటర్, దుక్క ఎల్లయ్య వీధిలోని వైసిపి నాయకుడు దుక్క హరి భాస్కర్ నివాసం నందు అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.
స్థానిక 48వ డివిజన్, బంగారయ్య కొట్టు సందు లోగల వైసిపి నాయకుడు పిళ్ల సూరిబాబు (జగ్గు) నివాసం నందు అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.
స్థానిక 38వ డివిజన్ రవి చెట్టు సెంటర్ వద్ద శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమంలో పలకమండలి చైర్మన్ బొమ్ము మధు, సభ్యులు నాగోతి విజయ నిర్మల, రాంపిళ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News