Breaking News

బీసీజేఆర్ సంక్షేమ ట్రస్ట్ తరపున సయ్యద్. సజ్జద్ హుస్సేన్ కు రూ. 15 వేలు ఆర్ధిక సాయం అందించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక బీమా పథకం కింద బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో సయ్యద్. సజ్జద్ హుస్సేన్ కు రూ. 15 వేలు ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చేతులు మీదుగా నేడు అందజేయడం జరిగింది. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన సయ్యద్ సజ్జద్ హుస్సేన్ భవన నిర్మాణ సెంట్రింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పడిపోవడంతో నడుము దగ్గర తీవ్రంగా దెబ్బ తగిలి.. ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది.. దీంతో ఆ కుటుంబానికి వైద్యసాయం నిమిత్తం మంత్రి ఆధర్వంలోని బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ రూ. 15 వేలు సాయం అందించి వారికి చేదోడుగా నిలిచింది. బీసీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్మిక బీమా పథకంలో నమోదు చేసుకున్న వారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తక్షణ వైద్య సాయం కోసం దాదాపు రూ. 20 వేలు వరకు సాయం అందించడం ద్వారా బీసీజేఆర్ వెల్పేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కార్మిక బీమాతో బనగానపల్లె నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ధీమా కల్పించడం జరుగుతోంది. నిస్వార్థంగా, సేవా దృక్ఫథంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు కష్టాల్లో అండగా నిలవడంతో పాటు, ఆపత్కాలంలో ఆదుకుంటున్న తీరుపై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *