Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్. ఓ .సీ అందజేత

-కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి ను (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 35 వ డివిజన్ పెజ్జోని పేటకు చెందినఎస్ మల్లీశ్వరి(43) జెయింట్ సెల్ ట్యూమర్ ( కణితి)సమస్యతో బాధపడుతూ గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ ఎన్డీఏ కార్యాలయంలో ఎల్. ఓ .సీ కొరకు దరఖాస్తు చేశారు. వారికి రూ3 లక్షల ఎల్.ఓ.సీ ను ఎన్డీఏ కూటమినేతల తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, డాక్టర్ హనుమంతరావు,అబ్దుల్ అజీజ్,బొల్లేపల్లి కోటేశ్వరరావు, మంగళపురి మహేష్, బ్రహ్మారెడ్డి, గడ్డిపాటి కిరణ్,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు దొడ్ల రాజా, కొల్లి దుర్గారావు, సప్పా శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *