విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ మై భారత్ ఆధ్వర్యంలో విజయ కార్గిల్ దివాస్ అనే కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ కళాశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబేదార్ మేజర్ ఎన్టీఆర్ జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ప్రెసిడెంట్ శివ నాగేశ్వరరావు మరియు డిస్టిక్ యూత్ ఆఫీసర్ సుంకర రాము ముందుగా ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన చిత్రపటానికి పూలమాలలు అర్పించడం జరిగింది. అనంతరం మేజర్ సుబేదార్ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ కార్గిల్ అనేది చరిత్రలో లిఖించిన గొప్ప విజయమని 524మంది సైనికులు ప్రాణాలను అర్పించి విజయాన్ని లిఖిస్తూ మన ఆ దేశ జాతీయ పథకాన్ని ఎగురవేశారని ఈనాటి విద్యార్థులు అందరూ దేశభక్తిని అలవర్చుకోవాలని సైనిక శిక్షణ క్రమశిక్షణ వంటి అంశాలను అలవర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మై భారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ ఈరోజు ఈ కళాశాలలో విజయ కార్గిల్ దివాస్ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులందరూ యువకులందరూ దేశ సైనికుల గురించి మరియు వారి యొక్క త్యాగాల గురించి ప్రతిరోజు తలచుకోవాలని మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారని కారణం మన సైనికులే కారణమని తెలిపారు. అనంతరం మేజర్ సుబేదార్ నా శివనాగేశ్వరరావు కి కళాశాల యాజమాన్యం తరఫున మరియు మైభారత్ డిపార్ట్మెంట్ తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞాపికను మరియు పుష్పగుచ్చాన్ని యువాధికారి ఆయనకు అందజేశారు.
Prajavartha Online Telugu News