Breaking News

నెల్లూరు లో ఘనంగా చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు లో స్థానిక టౌన్ హాల్ నందు నేటి ఉదయం చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కార్యనిర్వాహకులు పసుపులేటి వెంకటరమణ సినీ దర్శక, నిర్మాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల ఆర్ట్స్ కె.మణి నాయుడు సమర్పించే మనోహర్ నాయుడు నిర్మాణ నిర్వహణలో వి ఆర్ పి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘ధర్మచక్రం’ సినిమా ఆడియో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనితో పాటు చంద్రన్న సేవారత్న పురస్కారోత్సవం, సినీ నటి శ్రీదేవి సినీ స్వరాంజలి, సినీ నటి శ్రీదేవి అందాల, అభినయ పోటీలు, విఆర్పి క్రియేషన్స్ ‘పవర్’ చలన చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, సినీ దర్శక, నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కళాకారులని ప్రోత్సహించడానికి నిర్వహించామన్నారు. కార్యక్రమ నిర్వహణకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే చంద్రన్న సేవారత్న అవార్డుగ్రహీతలకు, పోటీలలో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కళారంగాభివృద్ధికి, కళాకారుల అభ్యున్నతికి తనవంతుగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అనంతరం అవార్డుగ్రహీతలకు, పోటీలలోని విజేతలను సత్కరించి మెమోంటోలు అందచేశారు. ఈ కార్యక్రమంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహణ సినీ దర్శకులు వెంకటరమణ పసుపులేటి, బలరామ్ నాయుడు, అశోక్ కొప్పుల, ఎన్ ఎస్ నాయుడు, వహీద్, కొండి శెట్టి సురేష్ బాబు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తదితరులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *