-నియోజకవర్గంలో హెచ్ ఎన్ ఎస్. ఎస్ కెనాల్ ద్వారా ఇరువైపుల స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు విరివిగా పాల్గొని జల హారతి కార్యక్రమాలను విజయవంతం చేయాలి…
-ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
-జల హారతిలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి
-నీటి ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
-జల హారతి కార్యక్రమం నందు వృద్ధులను, పిల్లలను తీసుకురాకండి
జిల్లా ఎస్పీ
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలో హెచ్ ఎన్ ఎస్. ఎస్ కెనాల్ ద్వారా ఇరువైపుల స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు విరివిగా పాల్గొని జల హారతి కార్యక్రమాలను విజయవంతం చేయాలిఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కడ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి హంద్రీనీవా కాలువ ద్వారా పరమ సముద్రం చెరువునందుజలహారతికార్యక్రమాలలో పాల్గొంటారు, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, స్పెషలాఫీసర్లు, మండల స్థాయి అధికారులు నాలుగు మండలాలలో హంద్రీనీవా కాలువ ప్రవశించే ప్రాంతాలలోరైతులనుజలహారతికార్యక్రమాలలో పాల్గొనే విధంగా ముందుస్తే ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి మణికంఠ చందోల, కడపిడి వికాస్ మరమత్, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈనెల 30 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో జల హారతి కార్యక్రమాలలో పాల్గొంటారు, వారి పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగు మండలాలలో సుమారు హెచ్ ఎన్ ఎస్ కెనాల్ 49 కిలోమీటర్ల ప్రయాణిస్తుందని ఆ కెనాల్ సమీపంలో సంబంధిత రైతులు జల హారతి కార్యక్రమాలలో పాల్గొనివిజయవంతంచేయాలని తెలిపారు, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి మండలాలకు ప్రత్యేక స్పెషల్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగిందని, వ్యవసాయ, ఉద్యానవన, ఏపీఎంఐపీ, జిఎం ఇండస్ట్రీ, జిల్లా అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు, కుప్పం నియోజకవర్గంలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయి ఇతర నియోజకవర్గాలలో పోలిస్తే కుప్పం నియోజకవర్గం చాలా తక్కువ శాతం ఉన్నదని తెలిపారు, జలహారతులు రైతులు విరివిగా పాల్గొని, నీటి విశిష్టతను గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచనతో ఈ కార్యక్రమంనిర్వహించుచున్నామని తెలిపారు, అందుకు ప్రతి మండలంలో రైతు సేవ కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, తెలుగు సిబ్బంది, నాలుగు మండలాలలో ఒక్కొక్క మండలంలో హంద్రీనీవా ప్రవహించే కాలవలు ద్వారా 25 పాయింట్లు గుర్తించి అక్కడ జల హారతి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మండల స్థాయి సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. ఈనెల 30వ తేదీన 10.30 ఉదయం నుండి 11.15 గంటల వరకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఆ సమయంలో కెనాల్ ప్రవహించే ప్రాంతాలలో కెనాల్ కి ఇరువైపుల రైతులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయా కార్యక్రమాలలో ఆహ్వానం పలకాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి లొకేషన్ నందు పోలీస్ సిబ్బంది నియమించడం జరిగిందని, జల హారతి కార్యక్రమాలలో, వృద్ధులను, పిల్లలను ఆహ్వానించకండి ఆదేశించారు, నీటి యొక్క విశిష్టతను గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయవలసిన బాధ్యత మన అందరి పై ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, ఆర్టికల్చర్ డిడి మధుసూదన్ రెడ్డి, సెరికల్చర్ జెడి పద్మావతి, డిపిఓ, సుధాకర్ రావు, ఇండస్ట్రీ జిఎం సూరిబాబు, ఇతర శాఖల అధికారులు, నాలుగు మండలాల వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News