Breaking News

తెలుగు భాష ఔనత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాలి…

-అమ్మ భాషకు మించిన కమ్మదనం మరోకటి లేదని…
-అమ్మ భాషకు మించిన కమ్మదనం మరోకటి లేదని…
-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషను ఆధునిక పద్ధతిలో ఆలోచించి, తెలుగు భాష ఔనత్యాన్ని చాటి చెప్పండంలో తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదిననాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళులు అర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలుగు భాష ఔనత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దేశ భాషలో గొప్పదైన కమ్మనిదైన తెలుగు భాషకు మించిన భాష మరోకటి లేదని అందుకే దేశభాషలందు తెలుగలెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తెలుగు భాషను ఆధునిక పద్ధతిలో ఆలోచించిన భాషా విజ్ఞాని కీర్తి శేషులు గిడుగు రామ్మూర్తి పంతులు అని తెలుగు భాష ఔనత్యాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గిడుగు రామ్మూర్తి జన్మదినమైన ఆగస్టు 29 న రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడుగా గిడుగు రామ్మూర్తి పరిగణించబడతారన్నారు. అభినవ వాగమశాసనుడుని బిరుదు పొందిన గిడుగు రామ్మూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చిన మహనీయుడన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని కమ్మదనాన్ని చాటి చొప్పిన గిడుగు రామ్మూర్తి తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరనీయులుగా నిలుస్తారన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలతో కలిపి దాదాపు 15 కోట్ల మంది ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతూ భాషలోని మాదుర్యాన్ని అశ్వాధిస్తున్నారన్నారు. కన్న తల్లిన్ని ఎంతగా ప్రేమించి గౌరవిస్తామో మాతృ భాష అయిన తెలుగు భాషను కూడా అంతగానే ప్రేమించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్యం నుండే తెలుగు భాషలో మాట్లాడడం, వ్రాయడం, చదవడం తప్పక నేర్పించి తెలుగు భాషను భావితరాలకు అందించడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.

గిడుగు రామ్మూర్తికి నివాళ్ళులర్పించిన వారిలో డిఎం అండ్‌ హెచ్‌వో ఎం సుహాసిని, ఐసీడీఎస్‌ పీడీ షేక్‌ రుక్సానా సుల్తానా బేగం, డిఆర్‌డీఎ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, కలెక్టరేట్‌ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *