Breaking News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి వారికి బీసీ ఐక్యవేదికల విన్నపం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ ఐక్యవేదికల సమక్షంలో ఆదివారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎస్ జే ఎఫ్, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్య వేదికలు సంయుక్తంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ ఐక్యవేదికల సభ్యులు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ, సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాటిస్తూ ఆయా సామాజిక వర్గాలలోని ప్రముఖుల, మహనీయుల పేర్లను ఆయా జిల్లాలకు పెట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఇనుమడింపజేసే విధంగా మంత్రివర్గ ఉప సంఘం వారు వ్యవహరిస్తూ మా యొక్క ప్రతిపాదనలను పరిశీలించి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి కి తమ ప్రతిపాదనలను విన్నవించుకోవడం జరిగింది.

శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా అని, కృష్ణాజిల్లా కు వంగవీటి మోహనరంగా కృష్ణాజిల్లా అని, గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా గుంటూరు జిల్లా అని, బాపట్ల జిల్లాకు బి.పి. మండల్ బాపట్ల జిల్లా అని, పల్నాడు జిల్లాకు కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా అని, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా అని, అనంతపురం జిల్లాకు శ్రీకృష్ణదేవరాయ అనంతపురం జిల్లా అని, నామకరణం చేయవలసిందిగా బీసీ ఐక్యవేదికల తరపున విన్నవించుకున్నారు. మా యొక్క ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఆమోదించి అమరవీరులకు తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా బీసీ ఐక్యవేదికల తరపున కోరారు.. ఈ సమావేశంలో రాష్ట్ర చైర్మన్ యర్రాకుల తులసి రామ్ యాదవ్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగరయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కో చైర్మన్ దాన గౌడ్, రాష్ట్ర కో కన్వీనర్ బోడపాటి పెదబాబు, రాష్ట్ర కో కన్వీనర్ కాకిలేటి హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *