-ఇన్చార్జ్ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఎన్టీఆర్ జిల్లా అభివృద్దికి కృషి చేస్తున్నారు
-సౌమ్యంగా కనిపించే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగి
-100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
-నందిగామ పట్టణం గాంధీ సెంటర్ లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి శంకుస్థాపన
-ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధానితో సమానంగా నందిగామను అభివృద్ధి చేసేందుకు ప్రతినిత్యం ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి కృషి చేస్తున్నాం. రాబోయే రెండు నెలల్లో నందిగామ నియోజకవర్గానికి ఆయుష్ హాస్పిటల్ తో పాటు కేంద్రీయ విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేసుకునే విధంగా జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్ లో దేవినేని వెంకట రమణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి విస్తరణ కోసం శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిధులు గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యబోసు, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరిండెంట్ కె వి ఎస్ సత్యనారాయణ పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భూమిపూజ అనంతరం శిలాపలకం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గ ప్రజల కల 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి…ఆ కలను సాకారం చేసిన ఘనత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకే దక్కుతుందన్నారు. ఇందుకు కోసం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎనలేని కృషికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారం తోడుగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇంత త్వరగా మంజూరు కావడానికి ఎమ్మెల్యే సౌమ్య కృషే కారణమంటూ కొనియాడారు. సౌమ్యంగా కనిపించే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగిలా పనిచేస్తారంటూ ప్రశంసించారు. ఏడాదిన్నర కాలంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
హైదరాబాదు నుంచి విజయవాడకు వచ్చే సిక్స్ లైన్ బైపాస్ మార్గం నందిగామ లోని పలు గ్రామాల మార్గాల నుంచి వెళుతుందన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్దంచేసినట్లు తెలిపారు. పెద్దవరం గ్రామంలో డిఫెన్స్ క్లస్టర్ రానుందన్నారు.ఇక పరిటాల లోనే కాకుండా నాలుగు గ్రామాల్లో రైల్వేస్టేషన్ లు రాబోతున్నాయన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చి జిల్లాను అభివృద్ది దిశగా నడిపించేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
అంతకు ముందుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గత వైసీపీ పాలకుల రాక్షస పాలనకు గురైన ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి రక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ , ఎంపీ కేశినేని శివనాద్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోవాలని ఆశించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా వుందన్నారు. అనతి కాలంలోనే హాస్పిటల్ అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తామన్నారు. తంగిరాల సౌమ్య అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తనతో చర్చలు జరుపుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి , నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోటా వీరబాబు, బిజెపి నందిగామ ఇన్చార్జ్ మాదల రమేష్ , డిస్టిక్ హెల్త్ కోఆర్డినేటర్ మాధవి దేవి , ఆర్డీవో బాలకృష్ణ , మరియు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ కోటమి నాయకులు, మిల్క్ యూనియన్ డైరెక్టర్లు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, హెల్త్ డిపార్ట్మెంట్ కార్యకర్తలు, ఆశా వర్కర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News