-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వము అందించే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అములు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం బాపట్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని,అంతకు ముందు అనంతపురము జిల్లా లో 18 నెలల పాటు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వము అములు పరిచే సంక్షేమ పథకాలు పకడబందీగా అములు చేయడం జరుగుతుందన్నారు.ప్రజలకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాలు హాల్స్, రెవెన్యూ శాఖ పరిధిలో పలు విభాగాలు మరియు సి పి ఓ,NIC, ల్యాండ్ & రికార్డ్స్,ఆర్ డి ఓ కార్యాలయాలు,కలెక్టరేట్ ఆవరణలోని పరిసరాలు పరిశీలించి అధికారులకు సిబ్బందికి పలు చూచనలు జారీ చేశారు.
అంతకుముందు కలెక్టరేట్ కు చేరుకున్న కలెక్టర్ గారికి జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడు,కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జునరావు,వేదపండితులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ,కొండయ్య కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలసి బొకే లు అందజేశారు.
Prajavartha Online Telugu News