తిరువూరు ఐషర్ ట్రాక్టర్ షోరూమ్‌లో రైతులకు ట్రాక్టర్ల పంపిణీ

-జీఎస్టీ తగ్గడంతో రైతులకు మేలు – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

తిరువూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు ఐషర్ ట్రాక్టర్ షోరూమ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. రైతు కష్టానికి తగిన గుర్తింపు రావాలంటే ఆధునిక పరికరాలు, సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, ఆ దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని అన్నారు.

ఇటీవల జీఎస్టీ తగ్గిన కారణంగా రైతులకు ట్రాక్టర్లు మరింత తక్కువ ధరకు లభిస్తున్నాయని, ఇది వ్యవసాయ రంగానికి చాలా పెద్ద మేలు చేస్తుందని ఆయన వివరించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమని, ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐషర్ కంపెనీ ఏజీఎం రమేష్ నాయుడు, టీఎం రసూల్, షోరూమ్ అధినేత కే. వినోద్, షోరూమ్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *