-బూచవరం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
-గండ్రాయి ఇళ్ల లే అవుట్, 1,2 గ్రామ సచివాలయాలు పరిశీలన
విజయవాడ / జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ టీకాలు పొందవలసిన వారిని గుర్తించేందుకు వాక్సినేషన్ సర్వే నిర్వహిస్తున్నట్టు విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ తెలిపారు. బుధవారం జగ్గయ్యపేట మండలం బూచవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ డివిజన్ రూరల్ మండలాల్లోని 19 పిహెచ్ సీల పరిధిలో 8,60,965 మంది కోవిడ్ వాక్సినేషన్ పొందేందుకు అర్హత కలిగివున్నారన్నారు. ఇప్పటివరకు 42 శాతం సర్వే పూర్తి అయ్యిందన్నారు.బూచవరం పిహెచ్ సి పరిధిలో 62,541 మంది వున్నారన్నారు. వీరిలో ఎంతమంది వాక్సినేషన్ పొందింది లేనిది గుర్తించి కోవిడ్ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.అన్ని ప్రాంతాల్లో వాక్సినేషన్ సర్వ్ వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఓపి వివరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీలు ఎక్కువ నమోదు అయ్యేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. దీనివల్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రల పై వత్తిడి తగ్గుతుందన్నారు.ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా బిపి తదితర వైద్య పరీక్షలను ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరీక్షలు చేయించుకున్నారు. గ్రామసచివాలయం,రైతు భరోసా కేంద్రం,వెల్ నెస్ సెంటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గండ్రాయి గ్రామంలో ఇళ్ల లే అవుట్ ను సందర్శించి ,ఇళ్ల నిర్మాణ పనులను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు మరింత వేగం పుంజుకునేందుకు గ్రామ స్థాయిలో నే నిర్మాణ సామగ్రి లబ్దిదారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలనిసంబంధిత అధికారులకు సూచించారు.వచ్చే నెలాఖరులోగా 50 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం గండ్రాయి 1,2 గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు.సచివాలయంలో అన్ని రిజిస్టర్లను పరిశీలించి, వాటిని శ్రద్ధగా నిర్వహించలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. తదుపరి మండలంలో జరుగుతున్న రీ సర్వే,పోలీస్ స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయింపు పరిశీలించారు.
Prajavartha Online Telugu News