-స్టార్ట్ అప్ కడప,స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీలలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి ని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు సవివరంగా వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి…
-జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ని అభినందించిన నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆనంద శేఖర్
వైయస్సార్ కడప, నేటి పత్రిక ప్రజావార్త :
వై ఎస్ ఆర్ కడప జిల్లా లో వినూత్నంగా అమలు చేస్తున్న స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్,అంగన్వాడీ లలో మౌలిక వసతుల కల్పన,పారిశుద్ధ్య నిర్వహణ కు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి ని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి…సవివరంగా వివరించారు…
శుక్రవారం న్యూఢిల్లీ లో నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆనంద్ శేఖర్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశమై వైయస్సార్ కడప జిల్లా అభివృద్ధి లో భాగంగా అమలు చేస్తున్న స్టార్ట్ అప్ కడప,స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీ లలో మౌలిక వసతుల కల్పన,పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి ని మరియు ఇతర పథకాల వివరాలను వాటి ప్రగతిని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు సవివరంగా జిల్లా కలెక్టర్ వివరించారు.. ఈ సందర్భం గా జిల్లా లో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.50 కోట్లు మంజూరుకు చేసేందుకు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.. జిల్లా ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు అభినందించారు.
Prajavartha Online Telugu News