-కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లకు మోక్షం
-ఏడాదిన్నర కాలంలోనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు
-మంత్రి బీసీ జనార్థన రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత వెల్లడి
-మైలవర్గం నియోజకవర్గంలో పలు రోడ్లకు శంకుస్థాపన
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ రహదారి అభివృద్దికి నోచుకోలేదు. రాహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులకు మహార్ధశ వచ్చిందని ఆర్.అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, మైలవరం మండలం లో పలు రోడ్లు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. అంతకు ముందు గొల్లపూడి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి జనార్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీలు ఇరువురు మంత్రి జనార్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఆ తర్వాత జి.కొండూరు మండలం కందులపాడు క్రాస్ రోడ్ వద్ద రూ.3.90 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో నిర్మించనున్న విజయవాడ – విస్సన్నపేట ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు, మైలవరం నుంచి నూజివీడు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు రూ.8.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి , ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అలాగే గణపవరం క్రాస్ రోడ్ వద్ద ఆ గ్రామవాసులతో కాసేపు మాట్లాడారు.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలోనే దెబ్బ తిన్న రహదారులను మరమ్మత్తులు చేయించిన ఘనత ఎన్డీయే కూటమికే దక్కుతుందన్నారు. విజయవాడ పార్లమెంట్ లోని అన్ని రహదారులకు సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోక్షం లభించిందన్నారు.
మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏ రోడ్డును అభివృద్ది చేయలేదన్నారు.మైలవరం నియోజకవర్గంలో ముఖ్యమైన రహదారులకు మోక్షం లభించిదన్నారు. ముత్యాలంపాడు బ్రిడ్జ్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి నోచుకోని మైలవరం నియోజకవర్గంలోని అన్ని రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు.అంతర్గత రోడ్లు, ఆర్. అండ్ బి రహదారులు పనులు నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రహదారుల నిర్మాణానికి విచ్చేసిన మంత్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, బిజెపి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు (బాల), జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీలతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News