-ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నాయకులు రావి ఫణి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ప్రతి ఏడాది సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్న రావి ఫణి ని ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News