Breaking News

5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో
ఈ నెల 5వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నారు. “మన నీరు-మన భవిష్యత్తు” సాగునీటి సంఘాల పాత్ర శీర్షికన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు అమరావతిలో హైకోర్టు దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లో 5వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరు కానున్నారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ బి.రాంబాబులతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం పరిశీలించారు. భోజన వసతి ఏర్పాట్లు,
తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఏఎస్పీ ఏ.టి.వి రవి కుమార్, డిఎస్పీ టి.మురళీ కృష్ణ, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *