Breaking News

వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు

-ప్రవేశ దరఖాస్తులకు ఎల్లుండి ఆఖరు తేదీ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గం వీరపనేని గూడెంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైందని డిసిఓ మురళి కృష్ణ , పాఠశాల ప్రిన్సిపాల్‌ గిరి కుమారి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 19వ తేదీ వరకు http://apbrgcet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకోసం ₹100 ప్రవేశ రుసుము నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ ప్రవేశాలు రిజర్వేషన్ల ప్రాతిపదికన జరుగుతాయని, ఇందులో ఎస్సీ కేటగిరీకి 75 శాతం (ఎస్సీ–1 5%, ఎస్సీ–2 32.5%, ఎస్సీ–3 37.5%), ఎస్టీలకు 6 శాతం, బిసిలకు 5 శాతం, బిసి–సిలకు 11 శాతం, మరియు ఓసిలకు 3 శాతం సీట్లు కేటాయిస్తారని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *