విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చెన్నుబోయిన చిట్టిబాబు పేర్కొన్నారు. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు చల్లని తాగునీరు, మజ్జిగ అందించడం గొప్ప సేవ అని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండే నాయకుడు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం నని కొనియాడారు. ప్రజల పట్ల మానవతా దృక్పథంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కేడీసీసీ బ్యాంకు సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ కొప్పుల స్వరూప, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కేడీసీసీ బ్యాంకు సిబ్బంది మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News