స్పందనలో 25 అర్జీలు స్వీకరణ – సమస్యల పరిష్కారానికి చర్యలు…

-ప్రధాన కార్యాలయాలలో 13 అర్జీలు స్వీకరణ
-సర్కిల్ కార్యాలయాలలో 12 అర్జీలు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాల మేరకు ప్ర‌ధాన కార్యాల‌యంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ వివిధ విభాగముల అధికారులతో కలసి స్పందన కార్యక్రమము నిర్వహించి అర్జీదారుల నుండి 21 ఆర్జీల‌ను స్వీక‌రించారు.

ప్రజలు సమర్పించిన సమస్యలను అర్జీలు పరిశీలించి, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 1, పట్టణ ప్రణాళిక – 6 పబ్లిక్ హెల్త్ – 4, యు.సి.డి విభాగం – 2 మొత్తం13 అర్జీలు స్వీక‌రించుట జరిగింది.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నరు.

మూడు సర్కిల్ కార్యాలయాలలో 12 అర్జీలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు.

సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు అద్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం నకు సంబందించి 2 అర్జీలు, సర్కిల్ – 2 నందు ఇంజనీరింగ్ -2, రెవిన్యూ-2, యు.సి.డి-1 మొత్తం 5 అర్జీలు మరియు సర్కిల్ – 3 నందు ఇంజనీరింగ్ -3, పబ్లిక్ హెల్త్ -1 మరియు పట్టణ ప్రణాళికా – 1 మొత్తం 5 అర్జీలు, మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో 12 మంది వారి వారి సమస్యల అర్జిలను జోనల్ కమిషనర్లకు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *