మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *