గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం గన్నవరం చేరుకొనున్నారు. అమెరికాలోని వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఈనెల 6వ తేదీ కుటుంబ సమేతంగా యార్లగడ్డ వెంకట్రావు అమెరికా వెళ్లారు. 20 రోజులు పాటు అమెరికాలో ఉన్న ఆయన పర్యటనని విజయవంతంగా ముగించుకొని శనివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. కాగా అమెరికాలో వ్యాపారసంస్థలు నిర్వహిస్తున్న యార్లగడ్డ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే అమెరికా వెళ్లిన ఆయన కేవలం 10రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులు కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆయన అమెరికా వెళ్లేందుకు కేసులు అడ్డంకిగా మారాయి. అమెరికాలోని తన వ్యాపార కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని వెంకట్రావ్ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో ఇటీవల కోర్టు అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే గా ఘనవిజయం సాధించిన తరువాత గత రెండు సంవత్సరాలు గా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గన్నవరం అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని గన్నవరం వస్తున్న యార్లగడ్డకు ఘనంగా స్వాగతం పలికేందుకు టిడిపి నాయకులు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.
Prajavartha Online Telugu News