Breaking News

ఎంఎల్ఏ కోటాలో 3 ఎంఎల్సి స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న మూడు శాసన మండలి సభ్యుల (ఎంఎల్సి) ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఆఖరి రోజైన మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా పాలవలస విక్రాంత్, దేవసాని చిన గోవింద రెడ్డి, ఇషాక్ భాషా వారి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ ముగ్గురూ నామినేషన్ పత్రంతో పాటు వై.ఎస్.ఆర్.సి.పి. నుండి పొందిన ‘బి’ ఫార్ము, అఫడవిట్, సెక్యురిటీ డిపాజిట్ తదితర పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రిటర్నింగ్ అధికారి పి.వి.సుబ్బారెడ్డి వీరి నావినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానపు 173 (ఎ) పరచ్చేదము ప్రకారం వీరిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యులచే ఎన్నుకోబడనున్న మూడు ఎం.ఎల్.సి. ఖాళీ స్థానాలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన ముగ్గురు అభ్యర్థులతో పాటు ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసన సభ్యులు ఒక్కొక్క సభ్యునితో నలుగురు చొప్పున హాజరయ్యారు. ఎం.ఎల్.సి.గా పోటీ చేసే అభ్యర్థులో తొలిగా పాలవలస విక్రాంత్ నామినేషన్ దాఖలు చేయగా వీరితో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. తదుపరి అభ్యర్థి దేవసాని చిన గోవింద రెడ్డి తో పాటు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, బద్వేల్ శాసన సభ్యురాలు డా.దాసరి సుధ హాజరయ్యారు. మూడో అభ్యర్థి ఇషాక్ భాషా తో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, శాసన సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *