Breaking News

ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

-ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COEs) లో, ఇంటిగ్రేటెడ్ IIT/JEE & NEET కోచింగ్ తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర (MPC/BiPC) కోర్సులలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు APSWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Co-education) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

(1.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, మేఘాద్రిగడ్డ, విశాఖపట్నం జిల్లా, 2. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, అమరావతి (తాడికొండ), గుంటూరు జిల్లా, 3. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, కోట, SPSR నెల్లూరు)
జిల్లాలో ఈ ఎక్సలెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్చి 2026లో జరిగిన SSC పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులై, 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్ధులు జూనియర్ ఇంటర్మీడియట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మార్చి 2026లో జూనియర్ ఇంటర్మీడియట్ (MPC/BiPC)లో 75% మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ కోసం దరఖాస్తు చేసుకోవచన్నారు. ఈ ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Co-education) కేంద్రాల ద్వారా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు సమగ్రమైన IIT-JEE మరియు NEET కోచింగ్, వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ మరియు ఇతర విద్యాపరమైన సహాయంతో కూడిన ఉచిత గురుకుల విద్యను అందిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు 75% సీట్లు మరియు ఇతర వర్గాల (OC, ST, BC) విద్యార్థులకు 25% సీట్లు కేటాయించే రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రవేశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. APBRAGCET వెబ్సైట్ https://apbrageet.apcfss.in లో 17 జూలై 2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30 జూలై 2026 అని తెలిపారు. ఇప్పటికే ఇతర జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసన్న వెంకటేష్ తెలిపారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మంత్రి డిఎస్ బీవీ స్వామి

పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, అందుకనుగుణంగా ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *