Breaking News

రోజుకు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం

-వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటున్నాం
-దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సీఎం గాడిన పెడుతున్నారు
-వరుసగా రెండో ఏడాది ట్రూ డౌన్ అమలు చేయబోతున్నాం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మూడో ఏడాదిలోకి అడుగుపెట్టామని, ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లకు తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నా, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్పకాలంలోనే గాడిలో పెట్టారని మంత్రి అన్నారు. ట్రాన్స్‌కోను బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించిన Rs.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అవసరమైన అన్ని సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *