Breaking News

ఆర్టీసి ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి…

-ఆర్టీసి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాలని”చలో విజయవాడ” భారీ ధర్నా
-ఆర్టీసిలో ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ఉధ్యోగభధ్రత కల్పించాలి
-ఏఐటియుసి రాష్ట్రప్రధానకార్యదర్శి యస్.వెంకటసుభ్భయ్య డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ (పి.టి.డి) లో వివిధ కేటగిరీలలో 26 జిల్లాల నుంచి సుమారు 8,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు చెల్లిస్తున్న నేపథ్యంలో వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కుల అమలులో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
అలాగే ఆర్టీసి అద్దెబస్సుడ్రైవర్లు, ఆన్ కాల్ డ్రైవర్ల కు చెందిన సమస్యలపై కూడా యూనియన్ ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తగిన న్యాయం జరగడంలేదని అన్నారు.ఆర్టీసి లో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉధ్యోగులకు చెల్లించే జీత,భత్యాలు చెల్లించాలని ఏఐటియుసి రాష్ట్రప్రధానకార్యదర్శి యస్. వెంకటసుభ్భయ్య డిమాండ్ చేసారు.

సోమవారం ఏపీఎస్ఆర్టీసీ (పి.టి.డి) ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులతో కలిసి “చలో విజయవాడ” పేరుతో భారీ ధర్నా తో పాటుభారీ భహిరంగ సభ దర్నాచౌక్ లో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఔట్ సోర్శింగు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకమిటి గౌరవ అధ్యక్షులు యల్. నాగసుబ్బారెడ్ఢి అధ్యక్షతన జరిగింది.

ఈ ధర్నాను నిర్వహిస్తున్న ఔట్ సోర్శింగు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి డి.గంగాంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.అలాగే ఆర్టీసీని ప్రవేటు విధ్యుత్ బస్సులతో ప్రైవేటీకరణ చేయలనుకుంటున్న నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి,
తదితర న్యాయమైన 16 డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెతో పాటు మరింత ఉధృతమైన ఉద్యమ కార్యక్రమాలను చేపట్టేందుకు వెనుకాడబోమని రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ (పి.టి.డి) ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర రావు,ఎఐటియుసి నాయకులు కె.ఆర్.ఆంజనేయులు, సాంబశివరావు, యం.హనుమంతురావు, సాంబశివ తో పాటు ఏపి ఔట్ సోర్శింగు ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

భారీర్యాలీ
ధర్నాకంటే ముందు హనుమాన్ పేట దాసరి భవన్ నుండి ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఔట్ సోర్శింగు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బాజీ , రాష్ట్రనాయకులు మధుసూదన్ రావు, కోశాధికారి దాసరి కిరణ్ , అశోక్ , ప్రసాద్ , మహి వర్మ, గజపతి , అర్జున్, శేఖర్, అనిల్ కుమార్, నవీన్ కుమార్ తధితరులు నాయకులతో పాటు రాష్ట్రంనలుమూలనుండి భారీగా ఔట్ సోర్శింగు ఉద్యోగులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *