Breaking News

గాజువాకలో రూ.2000 కోట్ల విలువైన భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తాం

-ఉప సభాపతి,అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె.రఘురామకృష్ణ రాజు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో దాదాపు రూ.2000 కోట్లు విలువ చేసే 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని ఉప సభాపతి మరియు అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె.రఘు రామకృష్ణ రాజు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది.అనంతరం అసెంబ్లీ భవనంలోని ఆయన చాంబరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప సభాపతి రఘరామ కృష్ణ రాజు మాట్లాడుతూ ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ పరిశ్రమ నెలకొల్పేందుకు 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాల భూమిని కేటాయించగా చేయగా ఆ సంస్థ దివాలా తీయడంతో ప్రస్తుతం ఆ భూమి జప్తునకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు.ఏపి రిఫ్రాక్టరీస్ సంస్థ భూములు మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్-కార్డులు(రీహాబిలిటేషన్ కార్డులు) అంశాలపై అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఫిర్యాదుల కమిటీ సమావేశంలో సభ్యులందరితో కలిసి చర్చించామని పేర్కొన్నారు.దీనిపై ఆగస్టు మొదటి వారంలో ఉన్నతాధికారులు,బ్యాంకర్లతో మరోసారి ఫిర్యాదుల కమిటీ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామనన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,కొణతాల రామకృష్ణ,గురజాల జగన్ మోహన్,విష్ణు కుమార్ రాజు తో కలిసి అసెంబ్లీ భవనంలోని ఆయన చాంబరులో మీడియా నిర్వహించారు.
ఈమీడియా సమావేశంలో అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ దివాలా తీయడంతో జాతీయ రహదారి-16 కి ఆనుకుని ఉన్న విలువైన భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన భూమిని జప్తు చేసుకునేందుకు చేపడుతున్న ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామన్నారు.అదే విధంగా స్టీల్ ప్లాంట్ కు భూములిచ్చిన వారి పునరావాసం కోసం ఇచ్చిన ఆర్-కార్డులకు సంబంధించి 1203 మందికి రెగ్యులరైజేషన్ పెండింగ్ లో ఉంచారని వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నామని శ్రీనివాసరావు చెప్పారు.
ఇంకా ఈసమావేశంలో కమిటీ సభ్యలు మరియు శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, గురజాల జగన్ మోహన్,విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *