Breaking News

దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు… వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు… వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలు. అలాంటి దేవాలయాల నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లోనూ ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు.

“సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారతీయ దేవాలయ నిర్మాణ సంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ హిత అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

విజయవాడలో నిర్వహించిన “సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏఈ ఫౌండేషన్‌ను అభినందించారు. భారతీయ దేవాలయ నిర్మాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇలాంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
దేవాలయాలు మన ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా భారతీయ వాస్తుశిల్ప ప్రతిభకు కూడా గొప్ప నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కనిపించే శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ ప్రణాళిక నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు.ముఖ్యంగా వాస్తుశిల్ప విద్యార్థులు శ్రీకాళహస్తి, లేపాక్షి, మదురై, సింహాచలం వంటి చారిత్రక దేవాలయాలను అధ్యయనం చేయాలని సూచించారు.
ఆ దేవాలయాల నిర్మాణాలను యథాతథంగా అనుకరించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆలోచన, సూత్రాలు, నిర్మాణ విధానాన్ని అర్థం చేసుకుని ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న నిర్మాణాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు.సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేయడం ద్వారానే భారతీయ వాస్తుశిల్పానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.భారతీయ సంస్కృతి, వారసత్వం, దేవాలయ నిర్మాణ సంప్రదాయాలపై యువతలో ఆసక్తిని పెంచే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *